అమరావతి, 5 ఆగస్టు (హి.స.)అమరావతి(Amaravati)లో అవినీతి(Corruption)కి అంతేలేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఆ ప్రాంతంలో కడుతున్న కట్టడాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు రూ. 4 వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయని, కానీ రూ. 10 వేలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. 10 శాతం కాంట్రాక్టు ఇచ్చి 8 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అమరావతిలోనే కాదని, అన్ని రంగాల్లో కమిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మట్టి, గ్రావెల్, మైనింగ్, కంపనీలు పెట్టాలన్నా కూటమి నాయకులకు కమిషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. ఈ అవినీతికి పోలీసులు సైతం సహకరిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమైన జగన్.. లిక్కర్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నేతలను వైసీపీ లీగల్ సెల్ న్యాయ సహాయం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన కూడా న్యాయమనేది కనిపించడంలేదని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి