ఆత్రేయపురం(, 6 ఆగస్టు (హి.స.)
:చనిపోయిన ఓ వ్యక్తి పేరు మీద 17 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్టుగా ఆన్‌లైన్‌లో చూపించడంతో ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆ కుటుంబ సభ్యులు అర్హత కోల్పోగా విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన పల్లెకొండ అజ్జయ్య అనే దళిత వృద్ధుడు ఇటీవల మరణించాడు. అతడి కుమారుడు భీమరాజు ఓ ప్రవేట్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. అర్జయ్య భార్యతో పాటు కుమారుడు భీమరాజు, భార్య ఒకే రేషన్‌కార్డులో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ