అమరావతి, 6 ఆగస్టు (హి.స.)
:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు )అధ్యక్షతన ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో కేబినెట్)సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. 12అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈపథకంఅమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.2024 నుంచి 2029కిఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిప్ట్) పాలసీ 4.0పై కేబినెట్ ఆమోదం తెలపనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ