నటుడు విజయదేవరకొండ ఈ డీ విచారణకు హాజరయ్యారు
హైదరాబాద్‌ 6 ఆగస్టు (హి.స.): నటుడు విజయ్‌దేవరకొండా) ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్‌ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఆరా తీస్తున్న
నటుడు విజయదేవరకొండ  ఈ డీ విచారణకు హాజరయ్యారు


హైదరాబాద్‌ 6 ఆగస్టు (హి.స.): నటుడు విజయ్‌దేవరకొండా) ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్‌ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 11న విచారణకు రావాలని రానాకు, 13న విచారణకు రావాలని మంచు లక్ష్మీకి నోటీసులు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande