తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి. అనుబంధంగా.మరొక. విశాలమైన భవ నిర్మాణం
తిరుమల6 ఆగస్టు (హి.స.) తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి అనుబంధంగా విశాలమైన మరొక భవనాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది . ప్రస్తుతం ఒకేసారి 4 వేల మంది భోజనం చేసేలా నాలుగు డైనింగ్‌ హాళ్లు అన్నప్రసాద కేంద్రంలో ఉన్నాయి. రోజుకు 70 నుంచి
తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి. అనుబంధంగా.మరొక. విశాలమైన భవ నిర్మాణం


తిరుమల6 ఆగస్టు (హి.స.) తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి అనుబంధంగా విశాలమైన మరొక భవనాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది

. ప్రస్తుతం ఒకేసారి 4 వేల మంది భోజనం చేసేలా నాలుగు డైనింగ్‌ హాళ్లు అన్నప్రసాద కేంద్రంలో ఉన్నాయి. రోజుకు 70 నుంచి 75 వేల మంది ఇక్కడ భోజనం చేస్తుంటారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది. ఇటువంటి సమయాల్లో ఈ కేంద్రం వద్ద భారీగా క్యూ లైన్లు ఉంటున్నాయి. దీంతో వెయ్యి మంది ఒకేసారి భోజనం చేసేలా మరొక హాలు అవసరమని టీటీడీ అధికారులు అంచనా వేశారు. వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి సమీపంలోని గ్యాస్‌ ప్లాంట్‌ను గోగర్భం డ్యాం వద్దకు తరలిస్తున్నందున, ఈ ప్రదేశంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిసింది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అన్నప్రసాద విభాగం అధికారులతో కలిసి సోమవారం ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande