గుడివాడ,, 6 ఆగస్టు (హి.స.) :గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిపైఅనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా సమయంలో దాతలు ఇచ్చిన వస్తువులు, దుప్పట్లు, మాస్కులు శానిటైజర్లు, ఆక్సిజన్ పరికరాలు, నగదుతో కొనుగోలు చేసిన బెడ్లు తదితరాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై 2013లో ఏసీటీ అధికారులు రెండు రోజులపాటు ఆస్పత్రిలో తనిఖీలు చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ