మద్యం.బార్ల ఎంపికకు .రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ
అమరావతి, 6 ఆగస్టు (హి.స.) మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్‌ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్య
మద్యం.బార్ల ఎంపికకు .రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ


అమరావతి, 6 ఆగస్టు (హి.స.)

మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్‌ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం బార్‌ల పాలసీ అమలుకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ముందస్తుగా ఈ పాలసీ అమలుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ఇచ్చిన అధ్యయన నివేదిక ఆధారంగా కొత్త బార్ల పాలసీ అమలుకు శ్రీకారం చుట్టనుంది.ఈ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande