ఏలూరు, 6 ఆగస్టు (హి.స.) జిల్లా ముదినేపల్లి మండలం పెద్దకామనపూడిలో ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ రాడ్ విరగడంతో ప్రమాదానికి. అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 27 మంది విద్యార్థులు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ