అమరావతి, 6 ఆగస్టు (హి.స.)ప్రాణాలను రక్షించాల్సిన అంబులెన్స్ మృత్యు శకటమైంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు ఎస్‌ఐ సూర్యభగవాన్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి తణుకు పట్టణానికి మంగళవారం ఉదయం ఓ అంబులెన్సు రోగిని తీసుకువస్తోంది. మార్గమధ్యంలో ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై, అదపుతప్పిన అంబులెన్సు.. బైకుపై పొలం పనులకు వెళ్తున్న రైతు గున్ను శ్రీరామ్మూర్తి(70), వ్యవసాయ కూలీ పెండ్ర చిరంజీవిని ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే దుర్మణం చెందారు. శ్రీరామ్మూర్తికి భార్య, కుమారుడు ఉన్నారు. చిరంజీవికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ