శ్రీవారి సేవలో సినీ నటి రమ్యకృష్ణ
తిరుమల, 6 ఆగస్టు (హి.స.)కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులు తిరుమల కొండకు చేరుకొని భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్త
తిరుమల


తిరుమల, 6 ఆగస్టు (హి.స.)కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులు తిరుమల కొండకు చేరుకొని భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ తరుణంలో తిరుమలలో వీఐపీ విరామ సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.ఈ నేపథ్యంలో ఇవాళ(బుధవారం) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు.

ఈ రోజు వేకువజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande