జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. వ్యక్తి మృతి
విజయనగరం , 6 ఆగస్టు (హి.స.)జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. ఏపీలోని విజయనగరం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటన కొత్తవలస మండలం ముసిరాంలో వెలుగు చూసింది. ఆస్తి వివాదంలో బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసు
జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. వ్యక్తి మృతి


విజయనగరం , 6 ఆగస్టు (హి.స.)జిల్లాలో నాటు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. ఏపీలోని విజయనగరం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటన కొత్తవలస మండలం ముసిరాంలో వెలుగు చూసింది. ఆస్తి వివాదంలో బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త ముదరడంతో నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. సమీప బంధువు కాల్పుల్లో అప్పారావు అనే వ్యక్తి మృతి చెందాడు. గడిచిన వారం రోజుల్లో గన్ ఫైరింగ్స్‌లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. వరుస ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande