ముగ్గురు టీటీడీ ఉద్యోగులపై చర్యలు.. కారణం ఇదే
తిరుమల, 6 ఆగస్టు (హి.స.)ముగ్గురు టీటీడీ ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలు ఉల్లగించిన కారణంగానే టీటీడీ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు ఉద్యోగుల్లో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేయగా, ఛార్జ్ మె
తిరుమల ఆస్తుల పరిరక్షణకు కమిటీ


తిరుమల, 6 ఆగస్టు (హి.స.)ముగ్గురు టీటీడీ ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలు ఉల్లగించిన కారణంగానే టీటీడీ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు ఉద్యోగుల్లో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేయగా, ఛార్జ్ మెమో జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్ రాము ప్రైవేటు వ్యక్తులతో కలిసి వ్యాపారాలు నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. అదే విధంగా ఆఫీస్ సబార్డినేట్ ఎన్ శంకర్ తన నివాసాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వడంతో పాటు ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు గుర్తించి ఆయనను సైతం సస్పెండ్ చేశారు. మరోవైపు జూనియర్ అసిస్టెంట్ చీర్ల కిరణ్ కార్యాలయ విధులు గాలికి వదిలేసి రాజకీయ నాయకుల సేవలో మునిగిపోయినట్టు గుర్తించి ఆయనకు ఛార్జ్ మెమో ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande