మేయర్ క్రేజ్.. ఏకంగా 20వేల రాఖీలతో రికార్డ్..
బరేలీ , 9 ఆగస్టు (హి.స.) ఉత్తర ప్రదేశ్, బరేలీ మేయర్ డాక్టర్ ఉమేష్ గౌతమ్ రక్షా బంధన్‌ను పురష్కరించుకుని మహిళలతో రాఖీలు కట్టించుకుంటూ ఉన్నారు. గత మూడు రోజుల నుంచి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా ఆయనకు రాఖీలు కట్టడానికి మహిళలు వస్తున్నారు. గ
rakhi spl for modi


బరేలీ , 9 ఆగస్టు (హి.స.) ఉత్తర ప్రదేశ్, బరేలీ మేయర్ డాక్టర్ ఉమేష్ గౌతమ్ రక్షా బంధన్‌ను పురష్కరించుకుని మహిళలతో రాఖీలు కట్టించుకుంటూ ఉన్నారు. గత మూడు రోజుల నుంచి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా ఆయనకు రాఖీలు కట్టడానికి మహిళలు వస్తున్నారు. గత మూడు రోజుల్లో ఆయన ఏకంగా 20 వేల మంది మహిళలతో రాఖీలు కట్టించుకున్నారు. ఎక్కువ రాఖీలు కట్టించుకున్న వ్యక్తిగా రికార్డు సైతం సృష్టించారు. రాఖీలు కట్టిన మహిళలకు రిటర్న్ గిఫ్ట్‌గా హామీలు ఇచ్చారు.

స్పెషల్ హెల్త్ కార్డ్ ద్వారా మిషన్ హస్పిటల్‌లో ఉచిత వైద్యం అందిస్తానని అన్నారు. ఇంటర్ మీడియట్ వరకు ఇచిత విద్యను అందిస్తానని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా నెల నెలా రేషన్ అందిస్తానని హామీ ఇచ్చారు. తన చెల్లెళ్ల సంక్షేమమే తన కర్తవ్యం అని ఆయన అన్నారు. రాఖీలు కడుతున్న సమయంలో అన్నదమ్ములు లేని కొందరు మహిళలు ఎమోషనల్ అయ్యారు. ఉమేష్‌ను తమ సొంత సోదరుడిగా భావిస్తామని చెప్పారు. దీంతో ఉమేష్ కూడా ఎమోషనల్ అయ్యారు. సంతోషంతో ఆయన కళ్లు తడి అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande