చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్..
భోపాల్ 9 ఆగస్టు (హి.స.) దేశవ్యాప్తంగా ఇవాళ రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఓ చెట్టుకు రాఖీ కట్టారు మంత్రి శివరాజ్. వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయన
కేంద్ర మంత్రి శివరాజ్..


భోపాల్ 9 ఆగస్టు (హి.స.)

దేశవ్యాప్తంగా ఇవాళ రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఓ చెట్టుకు రాఖీ కట్టారు మంత్రి శివరాజ్. వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయని, పక్షులు.. ఇతర జీవాలు కూడా చెట్లను జీవాధారంగా భావిస్తాయని ఆయన అన్నారు.

చెట్టుకు రెండు రాఖీలు కట్టిన ఆయన.. హారతి కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొందరు మహిళలు, అమ్మాయిలు.. మంత్రి శివరాజ్కు రాఖీ కట్టారు. ఆ ఆడపడుచులను ఆయన ఆశీర్వదించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande