జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి .
జమ్మూ,, 9 ఆగస్టు (హి.స.) ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) కుల్గాం (Kulgam) ప్రాంతంలో సైనిక ఆపరేషన్‌ (Anti Terror operation) కొనసాగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇ
Udhampur encounter


జమ్మూ,, 9 ఆగస్టు (హి.స.)

ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) కుల్గాం (Kulgam) ప్రాంతంలో సైనిక ఆపరేషన్‌ (Anti Terror operation) కొనసాగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు రహస్య స్థావరాలను ఏర్పరుచుకొని ఉంటున్నట్లు నిఘా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఈక్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు లాన్స్‌నాయక్‌ ప్రీత్‌పాల్‌ సింగ్‌, సిపాయి హర్మిందర్‌సింగ్‌లు మరణించారు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు చినార్‌ కార్ప్స్‌ సానుభూతి వ్యక్తంచేసింది. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని తెలిపింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande