జబల్‌పూర్, 9 ఆగస్టు (హి.స.) -మధ్యప్రదేశ్ రాష్ట్రం దశ తిరిగింది. ఆ రాష్ట్రంపై కనక వర్షం కురవనుంది. ఇనుప ఖనిజానికి నెలవైన ఆ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎ్‌సఐ)కు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారు. గ్రాములు, కిలోల్లో కాదు.. టన్నుల కొద్దీ బంగారం నిల్వలను కనుగొన్నారు. జబల్‌పూర్ జిల్లాలోని మహాగ్వాన్ కియోలరి ప్రాంతంలో ఏకంగా 100 హెక్టార్ల భూముల్లో లక్షల టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్టు కనిపెట్టారు. ఖనిజ నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో భాగంగా చేసిన మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని జీఎ్‌సఐ శాస్త్రవేత్త ఒకరు జాతీయ మీడియాకు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ