పండుగలకు ఊరెళ్లేవారికి రైల్వేశాఖ ఆఫర్.. టికెట్ పై భారీగా డిస్కౌంట్
న్యూఢిల్లీ, 9 ఆగస్టు (హి.స.) రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీ గా తెచ్చిన ఈ పథకం కింద రైల్వే ప్రయాణికులకు ఇకపై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగలకు ఊరెళ్లే ప్రయా
రైల్వే డిస్కౌంట్


న్యూఢిల్లీ, 9 ఆగస్టు (హి.స.)

రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ

రైల్వే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీ గా తెచ్చిన ఈ పథకం కింద రైల్వే ప్రయాణికులకు ఇకపై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగలకు ఊరెళ్లే ప్రయాణికులే తిరుగు ప్రయాణంలోనూ ఉంటే.. టికెట్పై 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇరువైపులా ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడం కోసమే టికెట్పై డిస్కౌంట్ను ప్రకటించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణానికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని, బుకింగ్ కూడా ఒకే క్లాస్లో, ఒకే స్టేషన్ నుంచి ఉండాలని స్పష్టం చేశారు.

ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం అమల్లోకి వస్తుందని ఇండియన్ రైల్వే తెలిపింది. రాయితీ ఛార్జీలపై ఎలాంటి రైల్వే కూపన్లు, వోచర్ ఆధారిత బుకింగ్, పాస్ లు అనుమతించబడవని వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande