టారిఫ్‌లపై ట్రంప్‌ విధానాలు చాలా చెత్తగా ఉన్నాయ-అమెరికన్‌ ఆర్థికవేత్త
దిల్లీ:, 9 ఆగస్టు (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ వార్‌పై స్వదేశంలోనూ వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా ఆర్థికవేత్త, జాన్‌ హాప్‌కిన్స్‌ యూని
us TARIFFS


దిల్లీ:, 9 ఆగస్టు (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ వార్‌పై స్వదేశంలోనూ వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా ఆర్థికవేత్త, జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీవ్‌ హాంకీ కూడా ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సుంకాల (Trump Tariffs) పేరుతో ట్రంప్‌ కడుతున్న పేక మేడ త్వరలోనే కూలిపోతుందని దుయ్యబట్టారు. అప్పటివరకు భారత్‌ ఆయన జోలికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.

జాతీయమీడియా సంస్థ ఎన్డీటీవీతో మాట్లాడిన స్టీవ్‌ హాంకీ.. భారత్‌పై ట్రంప్‌ విధించిన సుంకాల (Trump Tariffs on India) అంశాన్ని ప్రస్తావించారు. ‘‘సుంకాలపై ట్రంప్‌ నిర్ణయాలు పూర్తిగా అర్థరహితం. ఇక్కడో విషయం చెప్పాలి. ‘తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిద’నేది నెపోలియన్‌ మాట. ఇప్పుడు ట్రంప్‌ (Donald Trump) కూడా ప్రపంచదేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అనిపిస్తోంది. భారత్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌ కొంతకాలం ఓపిక పట్టి ఎదురుచూడాలి. ఎందుకంటే ట్రంప్‌ పేకమేడ త్వరలోనే కూలిపోతుంది’’ అని ఆ ప్రొఫెసర్‌ అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande