దిల్లీ: , 9 ఆగస్టు (హి.స.) లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో జరిగిన ఓట్ల చోరీ గురించి సంచలన ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్ అయ్యింది. ఆగస్టు 1న తాము బిహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని ప్రకటన విడుదల చేసినా.. ఇప్పటివరకు ఏ పార్టీ తమను మార్పులు చేర్పులపై సంప్రదించలేదని ఈసీ తెలిపింది. ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు నమోదు చేయలేదని పేర్కొంది. తాము విడుదల చేసిన ఓట్ల తొలగింపు ముసాయిదాపై రాహుల్ గాంధీ బిహార్ ఎన్నికలు పూర్తయ్యాక తన అభ్యంతరాలు చెప్తారేమో అని ఈసీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ