షాంఘై సదస్సుకు మోదీ..
బీజింగ్‌:, 9 ఆగస్టు (హి.స.) ఈ నెలాఖరులో చైనాలోని తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా మోదీ ఆగస్టు 29న జపాన్‌లో పర్యటించను
NDA parliamentary meet


బీజింగ్‌:, 9 ఆగస్టు (హి.స.) ఈ నెలాఖరులో చైనాలోని తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. తన పర్యటనలో భాగంగా మోదీ ఆగస్టు 29న జపాన్‌లో పర్యటించనున్నారు. అనంతరం ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్‌లో జగరనున్న ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లనున్నారు. ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మోదీ పర్యటనపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గువా జియాకున్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘షాంఘై సదస్సుకు మోదీని చైనా స్వాగతిస్తోంది’’ అని ఆయన బదులిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande