రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు
దిల్లీ:, 9 ఆగస్టు (హి.స.) రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, దేశ స్వాతంత్
రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు


దిల్లీ:, 9 ఆగస్టు (హి.స.) రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన వీరుల ధైర్యాన్ని స్మరించుకుని నివాళులు అర్పించారు

సోషల్ మీడియా X వేదికగా ఆయన ఈ పండుగ సోదరీ-సోదరుల మధ్య ప్రేమను మరింత పెంచుతుందని గుర్తు చేశారు. రక్షా బంధన్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా మోదీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande