ఎస్‌బీఐ లాభం రూ.21,201 కోట్లు-కలిసొచ్చిన ట్రెజరీ, ఫారెక్స్‌ ఆదాయాలు
దిల్లీ: , 9 ఆగస్టు (హి.స.) స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఫలితాల్లో రాణించింది. జూన్‌ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 9.71% వృద్ధితో రూ.21,201 కోట్లుగా నమోదైంది. ఇందుకు ట్రెజరీ, ఫారెక్స్‌ ఆదాయాలు కలిసొచ్చాయి. స్టాండలోన్‌ పద్ధతిన బ్య
Bombay Stock Exchange


దిల్లీ: , 9 ఆగస్టు (హి.స.) స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఫలితాల్లో రాణించింది. జూన్‌ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం 9.71% వృద్ధితో రూ.21,201 కోట్లుగా నమోదైంది. ఇందుకు ట్రెజరీ, ఫారెక్స్‌ ఆదాయాలు కలిసొచ్చాయి. స్టాండలోన్‌ పద్ధతిన బ్యాంకు నికర లాభం రూ.17,035 కోట్ల నుంచి రూ.19,160 కోట్లకు పెరిగింది.

రెపో రేటు తగ్గింపుతో ఎన్‌ఐఎమ్‌పై ప్రభావం: ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎమ్‌) 0.33% తగ్గి 3.02 శాతానికి చేరింది. దీంతో నికర వడ్డీ ఆదాయం 0.13% తగ్గి రూ.41,072 కోట్లకు పరిమితమైంది. ‘ప్రస్తుత జులై-సెప్టెంబరు త్రైమాసికంలోనూ సవాళ్లు ఉండొచ్చు. 2025-26 మొత్తంమీద 3% ఎన్‌ఐఎమ్‌ను లక్ష్యంగా పెట్టుకున్న’ట్లు బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. వడ్డీయేతర ఆదాయం 55% పెరిగి రూ.17,346 కోట్లకు పెరగడంతో, బ్యాంక్‌ లాభాల్లో వృద్ధి సాధ్యమైంది. రుణ వృద్ధి అంచనాను 12 శాతంగా కొనసాగిస్తున్నట్లు శెట్టి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande