కాలేశ్వరం ప్రాజెక్ట్ సిబిఐకి అప్పగించడంపై ఎంపీ ఈటెల రియాక్ట్
హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణను సీబీఐకి అప్పగించడంపై బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''మంచి పని చేశారు. వాళ్లకి చేత కాదని తె
ఎంపీ ఈటెల


హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణను సీబీఐకి అప్పగించడంపై బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మంచి పని చేశారు. వాళ్లకి చేత కాదని తెలుసు. వాళ్ల రిపోర్టు తప్పుల తడక అని తెలుసు... వాళ్ల రిపోర్టు నిలవదు అనేది వాళ్లకు అర్థమైంది. కాబట్టి డిస్ ఓన్ చేసుకోవడానికి ఈ పని చేశారు' అని అన్నారు. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ సంపూర్ణంగా ఎంక్వయిరీ చేస్తుందని నమ్మకముందని తెలిపారు. కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను బయటపెడుతుందని సంపూర్ణ విశ్వాసం మాకు ఉందని క్లారిటీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande