దేశంలోనే అతిపెద్ద కుంభకోణం 'కాళేశ్వరం'.. ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.) దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఇవాళ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ద్వారా
బిజెపి ఎంపీ లక్ష్మణ్


హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం

కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఇవాళ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని యావత్ బీసీ సమాజం విశ్వాసంతో ఉందన్నారు. బీసీల హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం బీసీలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. దొంగలు పడిన ఆరు నెలలకు.. కుక్కలు మొరిగిన చందంగా రేవంత్ సర్కార్ తీరు ఉందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 22 నెలల తర్వాత కాళేశ్వరంపై విచారణకు సీబీఐకి ఇవ్వాలని కనువిప్పు కలిగిందా అని సెటైర్లు వేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కుంభకోణం సీబీఐ దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని లక్ష్మణ్ అన్నారు. నిజం నిగ్గుతేల్చే సంస్థ సీబీఐ మాత్రమేనని తెలిపారు. అయితే, గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ను రీడిజైన్ చేసి తెలంగాణ సంపదను దోచుకోవడానికి, కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు అధికారులు వత్తాసు పలికారని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టేనని అన్నారు. రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టును రూ.లక్ష కోట్ల పైచిలుకు నిధులతో నిర్మించమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకుందనే పలుమార్లు తెలంగాణ బహిరంగ సభలో అన్నారని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande