స్వదేశీ ఉత్పత్తులపై గర్వించండి
న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.) దేశంలో పండుగల వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని చూసి గర్వించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయడం.. ఆత్మనిర్భర్‌ భారత్‌ వ
Modi


న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.) దేశంలో పండుగల వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని చూసి గర్వించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయడం.. ఆత్మనిర్భర్‌ భారత్‌ విధానం.. మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి దోహదపడుతుందన్నారు. జీవితంలో అవసరమైన ప్రతి అంశమూ ‘స్వదేశీ’ అయి ఉండాలని ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్‌ 125వ కార్యక్రమంలో మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న గణపతి నవరాత్రులు, త్వరలో వచ్చే శరన్నవరాత్రులు(దసరా), దీపావళి సందర్భంగా కొనుగోలు చేసే బహుమతులు, దుస్తులు, అలంకరణ సామగ్రి సహా ప్రతి వస్తువు కొనుగోలులో ‘స్వదేశీ’ మంత్రాన్ని మరచిపోవద్దని సూచించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande