ఆర్టీసీ డ్రైవర్లకు సెల్ ఫోన్స్ నిషేధం
కరీంనగర్‌, 1 సెప్టెంబర్ (హి.స.) ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే పరమావధిగా ఆర్టీసీ సంస్థ ముందుకు సాగుతోంది. కొన్నిసార్లు డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వీటికి చెక్‌ పెట్టా
ఆర్టీసీ డ్రైవర్లకు సెల్ ఫోన్స్ నిషేధం


కరీంనగర్‌, 1 సెప్టెంబర్ (హి.స.) ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే పరమావధిగా ఆర్టీసీ సంస్థ ముందుకు సాగుతోంది. కొన్నిసార్లు డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వీటికి చెక్‌ పెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు విధులు నిర్వహించే డ్రైవర్ల వద్ద సెల్‌ఫోన్‌లు ఉండకూడదని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. కార్పొరేషన్‌ పరిధిలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారు. ఫలితాల మేరకు దశల వారీగా అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు. డ్రైవరు విధుల్లో చేరేముందు తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేసి డిపోలోని సెక్యూరిటీ అధికారి (కార్యాలయం) వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. విధులు ముగించుకునేముందు తిరిగి తీసుకోవాలి. ఇంటి నుంచి కానీ, అత్యవసర సమయాల్లో సంబంధిత డ్రైవర్‌కు సమాచారం అందించడానికి డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్‌ఫోన్‌ నంబరును అందుబాటులో ఉంచుతారు. ఆ నంబరుకు కాల్‌ చేసి సమాచారమిస్తే సంబంధిత బస్సు కండక్టర్‌ ద్వారా సదరు డ్రైవర్‌తో

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande