హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం విషయంలో మొదటి నుంచీ సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్ చేశాం అని, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు అండగా ఉండి విచారణను ఆలస్యం చేసిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిజం ముందు తలవంచి.. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి అంగీకరించిందని పేర్కొన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లపై అసెంబ్లీలో సిట్ విచారణ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నియమించలేదని, అందుకే వెంటనే సీబీఐ విచారణ కోసం లేఖను పంపించాలని తాము డిమాండ్ చేస్తున్నాం అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజువారీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..