అనారోగ్య వార్తల వేళ.. ట్రంప్‌ పోస్ట్ వైరల్‌
వాషింగ్టన్‌/ముంబయి 01 సెప్టెంబర్ (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనారోగ్య వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ట్రంప్‌ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘మిస్సింగ్‌’ అంటూ ప్రచారం జరిగింది. అనంతరం, ఆయన ఆరోగ్య
U.S. President Donald Trump to lift sanctions imposed on Syria.


వాషింగ్టన్‌/ముంబయి 01 సెప్టెంబర్ (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనారోగ్య వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ట్రంప్‌ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘మిస్సింగ్‌’ అంటూ ప్రచారం జరిగింది. అనంతరం, ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. సోషల్‌ మీడియా ట్రుత్‌ వేదికగా ట్రంప్‌.. తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్‌గా అనిపించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, సోషల్‌ మీడియా వార్తలకు చెక్‌ పడినట్టు అయ్యింది.

ఇక, అంతకుముందు.. ట్రంప్ మద్దతుదారుడు, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డీసీ డ్రైనో ట్రంప్‌ ఆరోగ్యంపై ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా డైసీ.. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వారాల పాటు ప్రజల ముందుకు రాకుండా ఉంటారు. కానీ మీడియా ఆయన 'చురుగ్గా' ఉన్నారు.. ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతారు. ఇలాగే ఆయన డైపర్‌లు ధరించి నిద్రపోతున్నారు. అయినా ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ ట్రంప్ 24 గంటలు కనిపించకపోతే మీడియా గగ్గోలు పెడుతోంది. ఇది హాస్యాస్పదమైన ద్వంద్వ ప్రమాణం. అమెరికా చరిత్రలోనే అందరి అధ్యక్షుల కంటే ట్రంప్ ఎక్కువ సమయం ప్రజా పనుల్లో గడిపారు అని వివరించారు. దీనికి స్పందించిన ట్రంప్.. ‘నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను’ అని సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande