‌ యాదగిరిగుట్ట సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు. లభించింది
అమరావతి, : యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అరుదైన అంత‌ర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక్కడి ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు. కెన‌డాలోని ఒట్టవా న‌గ‌రంలో ఉన్న ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి దేవాల‌యంలో క‌ల్యాణం జ‌
‌ యాదగిరిగుట్ట సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు. లభించింది


అమరావతి, : యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అరుదైన అంత‌ర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక్కడి ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ అభినందించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు. కెన‌డాలోని ఒట్టవా న‌గ‌రంలో ఉన్న ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి దేవాల‌యంలో క‌ల్యాణం జ‌రిగిన తీరుతెన్నుల‌ను ప్రత్యేకంగా అభినందించారు. హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మిక‌త‌, ఐక్యతను ప్రశంసించారు. ఈ నెల 27 వరకు కెనడాలోని 4 రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. మార్క్ కార్నీ లేఖ‌పై మంత్రి కొండా సురేఖ, ఆల‌య ఈవో వెంక‌ట్రావు హ‌ర్షం వ్యక్తం చేశారు. స్వామివారి సేవ‌ల‌ను రానున్న రోజుల్లో భ‌క్తుల‌కు మరింత విస్తృతం చేస్తామని ఈవో వెంకట్రావు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande