నేను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.) ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్
జస్టిస్ సుదర్శన్ రెడ్డి


హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు.. ప్రతిపక్షాల అభ్యర్థినని చెప్పుకొచ్చారు. అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా తన మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. తాను రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నని చెప్పుకొచ్చారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత..చాలా మంది.. తనను రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నావని అడిగారని గుర్తు చేశారు. అయితే వారికి తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని, భవిష్యత్తులో కూడా ఉండబోదని, పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి తాను మాట్లాడుతానని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి, జస్టీస్ సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande