హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేసును సీబీఐకి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ కి ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'సీబీఐ అంటే బీజేపీ 'ప్రతిపక్షాల నిర్మూలన సెల్' అని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును అదే సీబీఐకి అప్పగిస్తున్నారు. మిస్టర్ రాహుల్ గాంధీ.. మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మేము చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతాం. న్యాయవ్యవస్థపై, ప్రజలపై మాకు పూర్తి నమ్మకం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు