బీఆర్ఎస్ లో సీబీఐ టెన్షన్!.. హుటాహుటీన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్
హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస
కెసిఆర్


హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ తాజాగ గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగింది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇవ్వడం, అసెంబ్లీ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande