కిడ్నాప్ ముఠా గుట్టురట్టు చేసిన బాలుడి మిస్సింగ్ కేసు
హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.) చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు చందానగర్ పోలీసులు. ముఠాను అదుపులోకి తీసుకొని నలుగురు చిన్నారులను కాపాడారు. ఈనెల 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రమేష్ (1) అనే బాలుడు తప్పిపోయాడు.
కిడ్నాప్ ముఠా అరెస్ట్


హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)

చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి

విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు చందానగర్ పోలీసులు. ముఠాను అదుపులోకి తీసుకొని నలుగురు చిన్నారులను కాపాడారు. ఈనెల 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రమేష్ (1) అనే బాలుడు తప్పిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేస్తుండగా పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా ఘటన వెలుగులోకి వచ్చింది.

దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తనతో పాటు మరో ముగ్గురు ఉన్నట్టు వెల్లడించాడు. నలుగురు నిందితులు ఒక ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande