శాసన మండలిలో కాళేశ్వరం మంటలు.. ఆందోళనకు దిగిన BRS ఎమ్మెల్సీలు
హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య నిప్పును రాజేస్తోంది. ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్టు అంతా ఓ ట్రాష్ అంటూ ఆ నివేదిక కాపీ
Mandali


హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టు

నివేదిక అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య నిప్పును రాజేస్తోంది. ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్టు అంతా ఓ ట్రాష్ అంటూ ఆ నివేదిక కాపీలను చించి చెత్తబుట్టలో పడేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సోమవారం శాసన మండలిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐ కి ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మండలిలో బీఆర్ఎస్ సభ్యులు మెరుపు ఆందోళనకు దిగారు. సభను ముందుకు సాగనివ్వకుండా ఆ పార్టీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారు. 'రాహుల కు సీబీఐ వద్దు.. రేవంత్కు సీబీఐ ముద్దు' అంటూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చి కాళేశ్వరం నివేదికను బీఆర్ఎస్ సభ్యులు చించేసి ఏకంగా పోడియం వైపునకు దూసుకెళ్లి విసిరేశారు. అనంతరం అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande