అమెరికా నుంచి స్వదేశానికి ఎమ్మెల్సీ కవిత.. జాగృతి, బీఆర్ఎస్ నేతల స్వాగతం
హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఉదయం 11.15కు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా కవితకు స్వాగతం పలికేందుకు జాగృతి నాయకుల
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఉదయం 11.15కు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా కవితకు స్వాగతం పలికేందుకు జాగృతి నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇంటర్నేషనల్ అరైవల్స్ బయటకు రాగానే ఆమెకు పూలమాలలు వేసి పూల వర్షం కురిపించారు. కాగా, చిన్న కుమారుడు ఆర్యను కళాశాలలో చేర్చేందుకు ఈనెల ఆగస్టు 16న ఎమ్మెల్సీ కవిత అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 15 రోజుల పాటు అక్కడే గడిపారు. ఇవాళ ఉదయం ఆమె తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande