మోడీ-పుతిన్-జిన్‌పింగ్ సంభాషణ.. ఎక్స్‌లో ఫొటోలు పెట్టిన మోడీ
న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.)రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సంభాషించుకున్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను మోడీ ఆ
THREE LEADERS


న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.)రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సంభాషించుకున్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను మోడీ ఆత్మీయంగా పలకించారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని రాసుకొచ్చారు. ఇక టియాంజిన్‌లో షాంఘై శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ప్రారంభ ఉపన్యాసం జిన్‌పింగ్ చేయగా.. అనంతరం మోడీ ప్రసంగం ప్రారంభించారు.

భారత్‌పై అమెరికా భారీగా సుంకాలు విధించింది. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు 50 శాతం సుంకం విధించినట్లు ట్రంప్ తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా చైనా వేదికగా మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిశారు. ఈ భేటీ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande