ఒకే కారులో మోడీ-పుతిన్.. ఆసక్తిరేపుతోన్న ప్రయాణం
న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.)చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సమావేశం ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో ప్రముఖంగా మోడీ-పుతిన్ కలయిక చాలా హైలెట్‌గా నిలుస్తోంది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు మోడీ-పుతిన్ ప్రత్యేకంగా కలుసుకుని చాలా సేపు
Putin, nerendramodi


న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.)చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సమావేశం ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో ప్రముఖంగా మోడీ-పుతిన్ కలయిక చాలా హైలెట్‌గా నిలుస్తోంది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు మోడీ-పుతిన్ ప్రత్యేకంగా కలుసుకుని చాలా సేపు సంభాషించుకున్నారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా మరొకసారి మోడీ-పుతిన్-జిన్‌పింగ్ మాట్లాడుకున్నారు. ఇక గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా.. కనీసం పట్టించుకోకుండానే మోడీ వెళ్లిపోయారు. గ్రూప్ ఫొటో దిగాక కూడా అలానే చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఎస్‌సీవో సమావేశం తర్వాత ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఒకే కారులో ప్రయాణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande