న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.)
భారత ప్రధాని నరేంద్ర మోదీఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని తియాన్‌జిన్ వేదికగా సోమవారం జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో స్పష్టం చేశారు
‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్‌సీవో సభ్య దేశంగా భారత్ కీలక భూమిక పోషిస్తోంది. ఎస్‌సీవో కోసం భారత్ విజన్, పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉంది. భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2025(SCO Summit)లో మోదీ ప్రసంగించారు.
సరిహద్దు ఉగ్రవాదం భారత్‌తో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకూ ఇదొక సవాల్‌గా మారిందని మోదీ స్పష్టం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ