సిబిఐ దర్యాప్తు ఆపాలంటూ.. హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్, హరీష్రరావు!
హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చ
హైకోర్టు


హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ల లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని కేసీఆర్, మంత్రి హరీష్రవులకు హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande