మహబూబాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)
వరి నాట్లు వేసి రోజులు గడుస్తున్నా
యూరియా అందకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే యూరియా అందించాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం 100 మందికి పైగా రైతన్నలు రాస్తారోకో చేపట్టారు. గడిచిన రెండు రోజులుగా సొసైటీలు, ఫర్టిలైజర్ షాప్ లో ఎదుట పడిగాపులు గాస్తున్న ఎంతకీ యూరియా అందకపోవటంతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పై బైఠాయించారు. రెండు రోజులుగా అరకొరగా లోడ్లు వస్తున్నా తమకు యూరియా ఎందుకు అందివ్వటం లేదని ఆరోపించారు.
సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారి పై కిలోమీటర్ ట్రాఫిక్ స్తంభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..