మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది
అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.) కొత్తకోట గ్రామీణం: మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కాటావరం స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్‌ లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గ
మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది


అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.)

కొత్తకోట గ్రామీణం: మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కాటావరం స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్‌ లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను అష్రస్‌ ఉన్నిసా (70), హసన్ (35), ఎల్లమ్మ (45)గా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అడ్డాకుల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande