ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర.మహాసభలు ముగిసాయి
గుంటూరు, 1 సెప్టెంబర్ (హి.స.) :రెండు రోజుల పాటు గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఐలా) రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఆదివారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జీ శ్య
ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర.మహాసభలు ముగిసాయి


గుంటూరు, 1 సెప్టెంబర్ (హి.స.) :రెండు రోజుల పాటు గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఐలా) రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఆదివారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జీ శ్యామ్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ విశిష్టతను పరిరక్షించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఐలా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శాంతకుమార్‌, ప్రధాన కార్యదర్శిగా పీ. నరసింహులు, ఉపాధ్యక్షులుగా బీ. డేవిడ్‌ రత్నకుమార్‌ (విజయవాడ), గుంటి సురేష్ బాబు(గుంటూరు), ఎం. అప్పారావు (విజయనగరం), జీ. రంగనాయకులు(అనంతపురం), కార్యదర్శులుగా ఏ. బ్రహ్మేశ్వరరావు, యూ. విష్ణుకుమార్‌, వై. నరేష్‌, కే. శాంతికుమార్‌, జీ. ప్రభుదాసు, బీ. చంద్రుడు, ఎంఈ గీతావాణి, కోశాధికారిగా మొగల్‌ కాలేషాబేగ్‌ ఎన్నికయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande