త్వరలో వాయుసేన చేతికి తేజస్‌ మార్క్‌-1ఏ
న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.) భారత వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న తేజస్‌ మార్క్‌-1ఏ యుద్ధవిమానాలు సిద్ధమయ్యాయి. ఈ తరగతికి చెందిన రెండు జెట్‌లను ఈ నెలాఖరులోగా వాయుసేనకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అందజేయనుందని రక్షణ శా
IAFs Rafale fighter jets will be equipped with mid-air refueling technology


న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.) భారత వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న తేజస్‌ మార్క్‌-1ఏ యుద్ధవిమానాలు సిద్ధమయ్యాయి. ఈ తరగతికి చెందిన రెండు జెట్‌లను ఈ నెలాఖరులోగా వాయుసేనకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అందజేయనుందని రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు. ఆ తర్వాత అదనంగా 97 తేజస్‌ జెట్‌ల సేకరణకు ఆ సంస్థతో మరో ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. మునుపటి కాంట్రాక్టు కింద తేజస్‌ మార్క్‌-1ఏ జెట్‌ల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై భారత వాయుసేన ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేసింది. రూ.48వేల కోట్ల విలువైన ఈ ఒప్పందం 2021 ఫిబ్రవరిలో కుదిరింది. ఈ యుద్ధవిమానాలకు ఇంజిన్లను సరఫరా చేయడంలో అమెరికాకు చెందిన జనరల్‌ ఎలక్ట్రిక్‌ సంస్థ జాప్యం చేయడం ఇబ్బందికరంగా మారింది. గతవారం రూ.67వేల కోట్లతో అదనంగా 97 తేజస్‌ మార్క్‌-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande