అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.)
విశాఖపట్నం: నగరంలో వసుధ ఫార్మా సంస్థ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. స్టీల్‌ప్లాంట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రగతి మైదానంలో ఆయన మృతదేహాన్ని, పక్కనే పురుగుల మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ