హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)
భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. నిన్నటి నుంచి నిమజ్జనానికి గణనాథులు తరలుతున్నారు. కాగా సోమవారం ఉదయం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో గణనాయకుల తరలింపు వాహనాల సందడి వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్లో గణేష్ నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. నిమజ్జన వేడుకల్లో యువత, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. భారీ బందోబస్తు నడుమ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. నిమజ్జనం వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 5 వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు