రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.. బీజేపీ జిల్లా నాయకులు
తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 1 సెప్టెంబర్ (హి.స.) రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి జిల్లా నాయకులు విమర్శించారు. సోమవారం రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించ
బిజెపి జిల్లా నాయకులు


తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 1 సెప్టెంబర్ (హి.స.)

రైతులకు సరిపడా యూరియా

సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి జిల్లా నాయకులు విమర్శించారు. సోమవారం రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుందని అయినా రైతు సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం జరిగిందని, పిఎసిఎస్ కార్యాలయాల వద్ద రైతులు యూరియా కోసం చిన్నపిల్లలతో వచ్చి క్యూలైన్లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేయడం మూలాన యూరియా కొరత తీవ్రంగా నెలకొందని, ఇదే అదునుగా భావించి కొంతమంది వ్యాపారస్తులు యూరియాను అధిక రేట్లకు విక్రయిస్తున్న మూలాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు సరిపడా యూరియాను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande