తిరుమల, 1 సెప్టెంబర్ (హి.స.)దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రులను పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు వినాయక మండపాలకు అంకితం కావడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్ధీ భారీగా తగ్గింది.
దీంతో ఈ రోజు సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న ఆదివారం కావడంతో రద్ధీ స్వల్పంగా ఉండటంతో.. నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 70,310 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 21,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.49 కోట్ల వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి