ఇంట్లో నాన్న.. పనిలో బాస్.. ఆ అదృష్టం నాకే కలిగింది : లోకేష్
అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.) చంద్రబాబు సీఎంగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయి కంటే ఎక్కువ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ నుంచి క్వాంటం వరకు సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వం అన్నారు. బయోటెక్ ఆకాంక్షల నుంచి డేటా ఆధార
నారా లోకేష్


అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.)

చంద్రబాబు సీఎంగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయి కంటే ఎక్కువ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ నుంచి క్వాంటం వరకు సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వం అన్నారు. బయోటెక్ ఆకాంక్షల నుంచి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు పురోగతి ప్రత్యక్ష సాక్ష్యం అని తెలిపారు. సీఎంగా తొలిసారి ప్రమాణం చేసి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్నకు శుభాకాంక్షలు అంటూ లోకేష్ ట్వీట్​చేశారు. ఇంట్లో నాన్న.. పనిలో బాస్ అనే పిలుచుకునే అదృష్టం నాకు కలిగిందన్నారు. పాలనకు సాంకేతికత జోడించి పెట్టుబడులు ఉద్యోగాల కల్పన వరకు ప్రయాణం సాగిందని వివరించారు. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగారని కొనియాడారు.

హైటెక్ సిటీ నుంచి జినోం వ్యాలీ వరకు కొత్త సాంకేతిక గుర్తింపును శక్తిమంతం చేశారని తెలిపారు. అమరావతి వరకు చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో ఆవిష్కరణకు మైలురాయి అయిందన్నారు. పాల నకు సాంకేతిక జోడించి పెట్టుబడులు ఉద్యోగాలు కల్పన వరకు ప్రయాణం కొనసాగిందని తెలిపారు. డేటా ఆధారిత సేవలు, సంస్థలను శక్తివంతం చేసే వేదికలతో సరికొత్త ఒరవడి సృష్టించారని అన్నారు. బలహీనుల సాధికారతలో గణనీయమైన పెరుగుదలకు నాంది పలికారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande