కడప, 1 సెప్టెంబర్ (హి.స.)కడప జిల్లాపై వరుణుడు కరుణచూపక పోయినా.. భారీగా సాగునీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలానికి పెద్ద ఎత్తున నీరు చేరుకుంది. అక్కడి నుంచి వచ్చే నీటితో జిల్లాలో ప్రాజెక్టుల్లో జలకల సంతరించుకుంది. కడప జిల్లాలో కృష్ణా జలాల ఆధారంగా నిర్మించిన గాలేరు- నగిరి ,తెలుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన రిజర్వాయర్లలో కృష్ణమ్మ జలు సవ్వడి తొణికిసలాడుతోంది. ఈ ఏడు ముందుగానే గాలేరు- నగరి ,తెలుగు గంగా రిజర్వాయర్లతో పాటు జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు అయిన కేసీకెనాల్ కు కూడా సాగునీరు రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కడప జిల్లాలో సాగునీటి రిజర్వాయర్లు 82. 255 టీఎంసీలు సామర్థ్యంతో నిర్మించారు. వీటిలో ప్రధానమైన ప్రాజెక్టులుగా గాలేరు -నగరి తెలుగుగంగ రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన రిజర్వాయర్లకు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పంపింగ్ చేసే రిజర్వాయర్ లతో కలిపి ఇప్పటికే 56. 613 టీఎంసీలు నీరు చేరింది. ప్రాజెక్టుల వారీగా ఆదివారం ఉదయానికి జిల్లాలో నీటి నిలవలను పరిశీలిస్తే..
జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన వాటిలో గాలేరు -నగరి ఒకటి. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ 26. 85 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించగా ఇప్పటికే 22.693 టీఎంసీల నీరు చేరింది. ఇంకా 11400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ రిజర్వాయర్ నుంచి 6,124 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 10.229 టీఎంసీలతో నిర్మించగా ఇప్పటికే 5.764 టీఎంసీల నీరు చేరింది. ఈ రిజర్వాయర్లోకి ఇంకా 880 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుండగా 155 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. అలాగే పైడిపాలెం ప్రాజెక్టు 6 టీఎంసీల సామర్థ్యం కాగా ఇప్పటికే 5.293 టీఎంసీల నీరు చేరింది. పైడిపాలెం చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్లకు గండికోట గిఫ్ట్ ద్వారా పంపింగ్ జరుగుతోంది. గండికోట నుండి గ్రావిటీ ద్వారా నీరు చేరే వామికొండ, సర్వారాయ
1.658 టీఎంసీలతో నిర్మించగా ఇప్పటికి 1.322 టీఎంసీల నీరు చేరింది. ఇంకా 880 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. 30 క్యూసెక్కులు మాత్రమే కిందికి వదులుతున్నారు. సర్వారాయ సాగర్ 3.09 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా ఇందులో ఇప్పటికే 1.003 టీఎంసీల నీరు చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి