అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు నూతన అధిపతి నియమితులయ్యారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి పి.వి. చలపతిరావు రాష్ట్ర నూతన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)గా నియమితులయ్యారు. ఆయన, పదవీ విరమణ చేసిన ఎ.కె. నాయక్ స్థానాన్ని భర్తీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, మంగళగిరిలోని అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో చలపతిరావు బాధ్యతలు స్వీకరించారు.
చలపతిరావు 2028 జూన్ నెలాఖరు వరకు పీసీసీఎఫ్‌గా కొనసాగనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కామారెడ్డి సబ్ డీఎఫ్‌వోగా ఉద్యోగ జీవితం ఆరంభించిన ఆయన, అటవీశాఖ ప్రణాళిక విభాగం, ప్రత్యేక కార్యదర్శిగా కూడా సుదీర్ఘకాలం పాటు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఎర్రచందనం, ప్రొడక్షన్ విభాగానికి పీసీసీఎఫ్‌గా సేవలందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి